మనుషులు చేసిన దేవుడు...

Friday, September 7, 2007

మనిషి దేవుడిని స్రిష్టించాడు. కాని విచిత్రం ఎమిటంటే దేవుడే మనిషిని స్రిష్టించాడని అనుకోవడం. దేవుడు అంటే "తెలియనిది" అని అర్థం. మనిషికి "తెలిసిన" కొద్దీ దేవుడు దూరమైపోతున్నాడు. ఉదాహరణకు ఆది మానవునికి సూర్యుడు, చంద్రుడు కూడా దెవుళ్ళే. కాని తరువాత.... అవి గ్రహాలు అయిపోయాయి. ఇప్పటికీ ఇంకా కొన్ని తెలియనివి ఉన్నాయి కాబట్టే, దేవుడు బతికి ఉన్నాడు. దేవుడు,భక్తి అనేవి ఒక వీక్నెస్, ఒక వ్యసనం. ఈ బలహీనతే మీకు బలాన్ని ఇస్తుంటే మీరు మానసికంగా బలంగా ఉన్నట్టా! చెప్పండి? దేవునికి దణ్ణం పెట్టుకొని పరీక్షకు వెళ్ళేవాడికి, పెట్టకుండా వెళ్ళి పరీక్ష బాగా వ్రాసేవాడికి, ఇద్దరు లో ఎవరు గొప్పవాడో మీరే చెప్పండి ! మన తప్పులు,కష్టాలు ఎవడో ఒకడి మీద నెట్టైయడానికి మనం దేవుడిని పుట్టించాం. సో, ప్రియ భక్తులారా మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. దేవుడు సాయం లేకుండా బ్రతకడం నేర్చుకోండి. వ్యసనపరులు కాకండి. సరే.."దేవుదున్నాడో లేడో తెలియదు కాని, ఎదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది" ఇది చాలా మంది జవాబు. నేను కూడా ఒప్పుకుంటాను. కాని ఆ శక్తి తో మనకు పనేమిలేదు.మనం పూజించినా లేకపోయ్నా దాని పని అది చేసుకుపొతుంది.(గురుత్వాకర్షణశక్తి లాంటిది).

Posted by Scorpio at 4:15 AM  

10 comments:

This is my newly created.,
chelam.blogspot.com

Sridhar said...
September 8, 2007 2:20 AM  

మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది

www.jalleda.com

జల్లెడ

September 14, 2007 2:13 PM  

దేవుడు ఉన్నాడా.. లేడా అని కాదు కానీ, నాకు తెలిసినంత వరకు, మనుషులను ఒక నమ్మకం నడిపిస్తుంది. అది దేవుడే కావచ్చు లేక ఇంకా ఎవరైనా స్వామీజీ కావొచ్చు.

September 20, 2007 2:00 AM  

చార్వాకమా, చార్వకమా?
చార్వకం అయితే అర్థం ఏవిటీ?
Thanks in advance.

teresa said...
September 20, 2007 8:11 AM  

మన అభిప్రాయాలు కలిసేలా వున్నాయి. నా బ్లాగు ఆధ్యాత్మిక విభాగం చూదండి.


--ప్రసాద్
http://blog.charasala.com

September 20, 2007 10:11 AM  

మీరిలా అంటే అనిపిస్తుంది మనిషి తెలుసుకోవడం[దేవుడి గురించి] ఇక్కడితో ఆపేస్తే బాగుండునని.

sahi said...
September 24, 2007 11:18 AM  

అలా అయితే మీరెందుకు బతికుండాలి? అసలెందుకు పుట్టాలి? ఒక బాంబు దాటిలో వందమంది చస్తే మీకు పోయేదేముంది? (మానవత్వం అని మాత్రం చెప్పకండి..రసాయన చర్యలతో సంభవించే ఏమోషన్స్ కి అంత స్పందించ వలసిన అవసరం లేదేమో..రసాయనాలు, శక్తులు వాటి పని చేసుకుంటూ పోతాయేమో కదా)
ఇవి విమర్శలు కావు..కొన్ని కుతూహల ప్రశ్నలే.

September 24, 2007 10:15 PM  

"చార్వక" అంటే దేవుడుని నమ్మని వాడు అని.
అలా నాస్తికత్వాన్ని ప్రచారం చెయ్యడమే "చార్వకం".

October 4, 2007 2:45 AM  

ఓ, అది చార్వాకమనుకున్నాను!

teresa said...
October 4, 2007 11:51 AM  

చాలా బాగుంది!

January 11, 2009 7:48 PM  

Post a Comment