అందమైన అనుభవాలు

Thursday, October 4, 2007

మనిషి తట్టుకొలేని భావావేశమే కవిత్వం,రచనలు.
అలాంటి వాటి కోసం నా "శేఖరీయం" చూడండి.

Posted by Scorpio at 2:15 AM 0 comments  

మనుషులు చేసిన దేవుడు...

Friday, September 7, 2007

మనిషి దేవుడిని స్రిష్టించాడు. కాని విచిత్రం ఎమిటంటే దేవుడే మనిషిని స్రిష్టించాడని అనుకోవడం. దేవుడు అంటే "తెలియనిది" అని అర్థం. మనిషికి "తెలిసిన" కొద్దీ దేవుడు దూరమైపోతున్నాడు. ఉదాహరణకు ఆది మానవునికి సూర్యుడు, చంద్రుడు కూడా దెవుళ్ళే. కాని తరువాత.... అవి గ్రహాలు అయిపోయాయి. ఇప్పటికీ ఇంకా కొన్ని తెలియనివి ఉన్నాయి కాబట్టే, దేవుడు బతికి ఉన్నాడు. దేవుడు,భక్తి అనేవి ఒక వీక్నెస్, ఒక వ్యసనం. ఈ బలహీనతే మీకు బలాన్ని ఇస్తుంటే మీరు మానసికంగా బలంగా ఉన్నట్టా! చెప్పండి? దేవునికి దణ్ణం పెట్టుకొని పరీక్షకు వెళ్ళేవాడికి, పెట్టకుండా వెళ్ళి పరీక్ష బాగా వ్రాసేవాడికి, ఇద్దరు లో ఎవరు గొప్పవాడో మీరే చెప్పండి ! మన తప్పులు,కష్టాలు ఎవడో ఒకడి మీద నెట్టైయడానికి మనం దేవుడిని పుట్టించాం. సో, ప్రియ భక్తులారా మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. దేవుడు సాయం లేకుండా బ్రతకడం నేర్చుకోండి. వ్యసనపరులు కాకండి. సరే.."దేవుదున్నాడో లేడో తెలియదు కాని, ఎదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది" ఇది చాలా మంది జవాబు. నేను కూడా ఒప్పుకుంటాను. కాని ఆ శక్తి తో మనకు పనేమిలేదు.మనం పూజించినా లేకపోయ్నా దాని పని అది చేసుకుపొతుంది.(గురుత్వాకర్షణశక్తి లాంటిది).

Posted by Scorpio at 4:15 AM 10 comments